వరంగల్: రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
వరంగల్ జిల్లా చింతగట్టు రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని డయల్ 112 సమాచారంతో కేయూ బ్లూకోల్ట్ పోలీసులు రక్షించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన పోలీసు సిబ్బందిని వరంగల్ సీపీ ఎన్. శ్వేత అభినందించి, నగదు రివార్డులు అందజేశారు.