భువనగిరి: ఓటర్లకు అలర్ట్: ఇకపై కార్యాలయాలకు వెళ్లనక్కర్లేదు, ఇంటి వద్దే సేవలు!
ఎస్ఐఆర్-2026 ప్రక్రియపై సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి కీలక ఆదేశాలు. ఓటర్లను విచారణ కోసం కార్యాలయాలకు పిలవొద్దని, బీఎల్ఓలే ఇంటికి వచ్చి పత్రాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కొత్త ఓటర్ల నమోదులో డిక్లరేషన్ తప్పనిసరి. పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని అధికారులకు సూచనలు.