కొండపి: పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెం వద్ద అదుపుతప్పి పొలాలలోకి దూసుకు వెళ్లిన పల్లె వెలుగు బస్సు, ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెం గ్రామ సమీపంలో సోమవారం ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు అదుపుతప్పి పొలాలలోకి దూసుకు వెళ్ళింది. ప్రమాదంలో బస్సులో ఉన్న 35 మంది సురక్షితంగా బయటపడ్డారు. స్టీరింగ్ లో సాంకేతిక లోపం తలెత్తి బస్సు మలుపు తిరగలేదని బస్సు డ్రైవర్ తెలిపాడు. బస్సు కందుకూరు నుంచి కనిగిరి కి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.