ఒంగోలు అర్బన్: కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో నూతన అంగన్వాడి భవనాన్ని ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు
Ongole Urban, Prakasam | Oct 14, 2026
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో నూతన అంగన్వాడి భవనాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు బుధవారం ప్రారంభించారు. 20 లక్షల రూపాయలతో అంగన్వాడి భవనాన్ని నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలానే అల్లూరు గ్రామంలో ఒక కల్వర్టులు రహదారులను అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలిపారు. ఒంగోలు నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తామని దామచర్ల జనార్ధన తెలిపారు.