మంచిర్యాల: సింగరేణిలో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ప్రాధాన్యత: డైరెక్టర్ వెంకటేశ్వర్లు
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి డైరెక్టర్ కే. వెంకటేశ్వర్లు పర్యటించారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తూ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నూతనంగా సమకూర్చిన 6.5 టన్నుల లోడర్ను ప్రారంభించారు.