అనంతపురం జిల్లా రామదాసు పేట వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి వృద్ధురాలికి గాయాలు
Anantapur Urban, Anantapur | Nov 30, 2025
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని గార్లదిన్నె మండలం రామదాసు పేట వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో అనంతపురం నగరానికి చెందిన నాగమ్మ అనే వృద్ధురాలికి గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.