శ్రీశైలం: ఆత్మకూరులో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి మాజీ మున్సిపల్ చైర్మన్
ఆత్మకూరు పట్టణంలో వైఎస్సార్సీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ నూర్ అహ్మద్ టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న నూర్ అహ్మద్‌ను ఎమ్మెల్యే సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నూర్ అహ్మద్‌తో పాటు సుమారు 200 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ చేరికతో ఆత్మకూరు పట్టణంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.