జనగాం: జనగామలో కరువు ప్రకటించాలని కలెక్టరేట్ ఎదుట సీపీఐ నిరసన
వర్షాభావం, ఎల్నినో ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయని జనగామ జిల్లాలోని 12 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ సీపీఐ నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. వరి, పత్తి, మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వినతిపత్రం అందజేశారు.