చిలుకూరు: చిలుకూరులో ఇంజనీరింగ్ కళాశాల బిల్డింగ్ పైనుండి దూకి జైపూర్ మండలానికి చెందిన బీటెక్ విద్యార్థిని కృష్ణవేణి ఆత్మహత్య
చిలుకూరులోని గేట్ ఇంజినీరింగ్ కాలేజీ బీటెక్ విద్యార్థిని తెల్లవారుజామున సూసైడ్ చేసుకుంది.మంచిర్యాల జిల్లా జైపూర్ మండలానికి చెందిన కృష్ణవేణి ఉగాదికి ఇంటికి వెళ్లి శుక్రవారం తల్లితో కలిసి కాలేజీకి వచ్చింది. రాత్రి తల్లితో పడుకున్న కృష్ణవేణి తెల్లవారుజామున కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.