భీమారం 20: దుబాయి జైలులో జగిత్యాల వాసి: రూ.39 లక్షల జరిమానా చెల్లించలేక అల్లాడుతున్న వైనం
Bheemaram 20, Jagtial | Oct 5, 2026
ఓమాన్ నుంచి దుబాయిలోకి అక్రమంగా ప్రవేశించిన జగిత్యాల జిల్లా వాసి ఏగుర్ల మల్లేశం, భారీ జరిమానా చెల్లించలేక జైలులోనే ఉండిపోయారు. ఆయనను విడిపించాలని కోరుతూ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ ఎన్నారై విభాగం దీనిపై చర్యలు చేపట్టింది.