కనిగిరి: హనుమంతునిపాడు ఎంపీడీవో కార్యాలయం వద్ద పెండింగ్ బిల్లులు తక్షణం చెల్లించాలని ఉపాధి కూలీల ధర్నా
హనుమంతునిపాడు: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు మంగళవారం హనుమంతునిపాడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... మూడు నెలలుగా ఉపాధి కూలీలకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి కూలీలు ఏం తిని బ్రతకాలని ప్రశ్నించారు. ఉపాధి కూలీలకు పెండింగ్ బిల్లులు తక్షణం చెల్లించడంతోపాటు ఒక్కొక్క కూలికి రోజువారి కూలి రూ.600లు ఇవ్వాలన్నారు.