పటాన్చెరు: మాదారం స్టోన్ క్రషర్లపై కలెక్టర్కు గ్రామస్థుల ఫిర్యాదు
జిన్నారం మండలం మాదారం సమీపంలోని రాక్సాండ్, ఏఏఏ స్టోన్ క్రషర్ల వల్ల ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని, పంటలు నష్టపోతున్నామని గ్రామస్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న క్రషర్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.