మెట్ పల్లి మున్సిపాలిటీ పత్రిక ప్రకటన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీ బి. రాజా గౌడ్ గారు మొదటిసారిగా మెట్ పల్లి మున్సిపాలిటీని సందర్శించారు. అనంతరం అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే వార్డ్ ఆఫీసర్లతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి వార్డ్ ఆఫీసర్ ల యొక్క పనితీరును వారి విధులు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిల్ కలెక్టర్స్ ఇంటి పన్ను వసూలు చేసి 100% లక్ష్యాన్ని పూర్తి చెయ్యాలని ఆదేశించారు. పట్టణంలోని 16వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను అదనపు కలెక్టర్ గారు పరిశీలించారు.