తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు గురైన చేనేత కుటుంబాలకు ఆ శాఖ బియ్యం, నూనె, పప్పు, చక్కెర, ఉల్లగడ్డ, ఎర్రగడ్డలతో కూడిన కిట్ అందజేసింది. చేనేత పనిపై ఆధారపడిన కుటుంబాలకు కాకుండా అర్హత లేని వారికి కిట్లు అందజేసి పక్షపాతం వహించారని వింజమూరు బీసీ కాలనీకి చెందిన కొందరు వాపోయారు. ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. మగ్గం నేసే కుటుంబాలకు సాయం అందలేదని చెప్పారు. తమకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.