రాయదుర్గం: రోడ్లపై పశువులను వదిలే యజమానులకు రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి హెచ్చరిక
రాయదుర్గం పట్టణంలో రోడ్లపై పశువుల సంచారం నివారించేందుకు ఎట్టకేలకు అధికారులు చర్యలు చేపట్టారు. వారం రోజులలోపు పశువుల యజమానులు తమ ఆవులు, గాడిదలు ఇతర జంతువులను కట్టడి చేసుకోవాలని లేదంటే గోశాలకు తరలిస్తామని మున్సిపల్ చట్టం ప్రకారం యజమానులపై చర్యలు తీసుకుంటామని కమీషనర్ దివాకర రెడ్డి తెలిపారు. ఈమేరకు బుధవారం ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చామని, ఇదే ఆఖరు హెచ్చరిక అన్నారు.