గుంటూరు: అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత: అభినందించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
Guntur, Guntur | Jul 5, 2025 2012 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ కూచిపూడి క్రాంతి కుమార్ కుటుంబానికి ఏఆర్ కానిస్టేబుల్స్ తమ వంతు సాయంగా 1,35,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం అభినందనీయం అని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. శనివారం సాయంత్రం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గల ఎస్పీ ఛాంబర్ లో అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్ క్రాంతి కుమార్ కుటుంబానికి తోటి 2012 ఏఆర్ బ్యాచ్ అందించిన నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపు నుండి కూడా బాధిత కుటుంబానికి అందవలసిన అన్ని ప్రయోజనాలు సకాలంలో అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.