హుస్నాబాద్: గౌరవెల్లి భూ నిర్వాసితుల ఆవేదన: ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు
గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కోసం కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.