మార్కాపురం: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పింఛన్ సదుపాయం కల్పించాలని కలెక్టర్ విజయ సునీతకు బాధితుడు వినతి
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తర్లుపాడు మండలం కందాల పల్లి గ్రామానికి చెందిన దీనావళి తనకు పింఛన్ సదుపాయం కల్పించాలని కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ సచివాలయాల చుట్టూ రెండున్నర సంవత్సరాల నుండి తిరుగుతున్న తమకు న్యాయం చేయలేదని అన్నారు. తన కాలు పోయి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నానని ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం చేయలేదన్నారు. ఇప్పటికైనా పింఛన్ సదుపాయం కలిగించాలని కోరారు.