మామిడికుదురు: మామిడికుదురులో భారీ వర్షం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
మామిడికుదురు మండలంలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం వల్ల రహదారులు జలమయం అయ్యాయి. ఈదురుగాలుల ధాటికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే విద్యుత్ పునరుద్ధరణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.