పటాన్చెరు: శేరిలింగంపల్లిలో ఇళ్ల కూల్చివేత నిలిపివేత: 45 రోజుల గడువు పొడిగింపు
శేరిలింగంపల్లి ఓల్డ్ ఎంఐజీలో పేద కుటుంబాల ఇళ్ల తొలగింపును పటాన్చెరు బీఆర్ఎస్ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి అడ్డుకున్నారు. ప్రత్యామ్నాయ నివాసాలు కల్పించే వరకు ఇళ్లను తొలగించవద్దని రైల్వే అధికారులను కోరగా, బాధితులకు 45 రోజుల గడువు ఇచ్చేందుకు వారు అంగీకరించారు.