వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో మున్సిఫ్ కోర్టు ఏర్పాటు కోసం కసరత్తు కొనసాగుతోంది. పట్టణ కేంద్రంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో తాత్కాలిక మున్సిఫ్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీత వెల్లడించారు. ఈ మేరకు మునిసిపల్ కమిషనర్ ఎమ్మార్వోలతో కలిసి మున్సిపల్ పాత భవన సముదాయాన్ని పరిశీలించారు. కోర్టు ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను న్యాయమూర్తి నిర్మల గీత ఆదేశించారు.