కొత్తపేట: రావులపాలెంలో పెన్షనర్స్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
రావులపాలెంలో మండల పెన్షనర్స్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భూమి పూజ చేశారు. విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం, భద్రత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.