ఏటూరునాగారం: మంగపేట కొత్త ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మధుకర్
ములుగు జిల్లా మంగపేట పోలీస్ స్టేషన్ కొత్త ఎస్సైగా మధుకర్ బాధ్యతలు స్వీకరించారు. టీవీఆర్ సూరి బదిలీ కావడంతో ఆయన స్థానంలో మధుకర్ నియమితులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.