కోటి సంతకాల సేకరణ పేరుతో వైసిపి హైడ్రామా
- వైసీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మాజీ ఎంపీ నెలవల
కోటి సంతకాల సేకరణ పేరుతో వైసిపి హైడ్రామాకు తెరతీసిందని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేని వైసీపీ ఎమ్మెల్యేలు కోటి సంతకాల పేరుతో హైడ్రామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై పోరాడటం వైసిపికి చేతకాదని విమర్శించారు.