బెల్లంపల్లి: మంచిర్యాల: వీరాపూర్ లో అధ్వానంగా మారిన రైతు రహదారి
మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం వీరాపూర్ గ్రామంలో ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో 200 ఎకరాల పంట పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే రాకపోకలు నిలిచిపోతున్నాయని, అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.