గద్వాల్: గద్వాల జిల్లా విద్యార్థుల కోసం ప్రత్యేక ఆధార్ శిబిరాలు - కలెక్టర్ ఆదేశం
గద్వాల జిల్లాలో విద్యార్థులందరికీ ఆధార్ కార్డులు అందించేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. అంగన్వాడీలు, విద్యాసంస్థల్లో ఆధార్ నమోదును వేగవంతం చేయాలని, నిబంధనల ప్రకారం ఆధార్ అప్డేట్స్ చేపట్టాలని సూచించారు.