కోడుమూరు: కోడుమూరులో ఎంపీటీసీ నామినేషన్ల వేళ ఎస్ఐ కీలక ప్రకటన
కోడుమూరు ఎంపీటీసీ నామినేషన్లపై ఎస్ఐ ఎర్రి స్వామి కీలక ప్రకటన చేశారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే దగ్గరుండి నామినేషన్ వేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నామినేషన్లు సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు.