పార్వతీపురం: కొత్తవలసలో జ్వరాల కలకలం: స్వచ్ఛందంగా శుభ్రత చేపట్టిన గ్రామస్థులు
పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలస గ్రామంలో రెండు నెలలుగా జ్వరాలు వేధిస్తున్నాయి. పరిసరాల అపరిశుభ్రతే కారణమని గుర్తించిన గ్రామస్థులు స్వచ్ఛందంగా శుభ్రత చేపట్టారు. గ్రామానికి బ్లీచింగ్ పౌడర్ సరఫరా చేయాలని సచివాలయ అధికారిని కోరుతున్నారు.