వనపర్తి: జ్వరంతో వచ్చే వారికి మలేరియా, డెంగ్యూ పరీక్షలు తప్పనిసరి - కలెక్టర్ ఆదేశం
వనపర్తి జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు కలెక్టర్ ఆదర్శ్ సురభి కీలక ఆదేశాలు జారీ చేశారు. జ్వరంతో వచ్చే రోగులకు పరీక్షలు చేయడంతో పాటు, బస్తీ దవాఖానాల్లో పాము, కుక్క కాటు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.