శ్రీశైలం: బండి ఆత్మకూరు మండల కేంద్రంలో పల్లెపండుగ–3.0 కార్యక్రమంలో రూ.2.40 కోట్ల నిధులతో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బుడ్డా
బండి ఆత్మకూరు మండల కేంద్రంలో పల్లెపండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా రూ.2.40 కోట్ల నిధులతో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలు అందించేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.