ఆసిఫాబాద్ లో గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ నితికా పంత్ బుధవారం సాయంత్రం 6గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చారు. చెకోపోస్టుల్లో నిఘా, డబ్బు, మద్యం రవాణ నివారణ, సోషల్ మీడియా పర్యవేక్షణ, సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్, నాకబందీలు నిర్వహించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.