వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ నిరసన: కలెక్టరేట్ వద్ద ఆందోళన
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ఆరోపిస్తూ ఎర్రబెల్లి ప్రదీప్రావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. బూడిద గుమ్మడికాయలు కొట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంట రవితో పాటు పలువురు పాల్గొన్నారు.