అమలాపురం: అమలాపురం గీతాస్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం
అమలాపురం గడియార స్తంభం సమీపంలోని గీతాస్ రెస్టారెంట్లో గ్యాస్ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. రెస్టారెంట్లోని సామగ్రి కాలిపోగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.