సత్యవేడు: కీలపూడి గ్రామంలో సిఏ పాసైన మొదటి వ్యక్తిగా నాని నిలిచారు
కీలపూడిలో CA పాసైన మొదటి వ్యక్తిగా నాని పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామానికి చెందిన నాని అలియాస్ చందు ఆ గ్రామంలో CA పాసైన మొదటి వ్యక్తిగా నిలిచారు. పట్టుదల, నిబద్ధత, రాత్రింబవళ్లు అలసట తెలియకుండా కష్టపడటంతో ఈ విజయాన్ని చేరుకున్నారని పలువురు యువకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం కీలపూడి యువతకు మాత్రమే కాదని, ఈ తరానికి స్పూర్తి దాయకంగా నిలిచిందని పలువురు ప్రశంసించారు.