చిట్యాల: చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమావేశం
చిట్యాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఓటరు నమోదుపై సమావేశం జరిగింది. పట్టణ అధ్యక్షుడు ఎద్దులపూరి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి నేతలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.