గుంతకల్లు: గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ లో ఆటో, కారు ఢీ, ఆటో డ్రైవర్ నరసింహులుకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ లో మంగళవారం కారు, ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు మండలంలోని అమీన్ పల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నరసింహులు వేరుశనగ లోడు వేసుకుని గుత్తి అర్ ఎస్ రోడ్డులో ఉన్న మార్కెట్ యార్డు లో ఆన్ లోడ్ చేసేందుకు వచ్చాడు. అనంతరం తిరిగి అమీన్ పల్లి కి వెళ్తుండగా గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ లో కారు, ఆటో పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ నరసింహులు గాయపడ్డాడు. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.