శ్రీశైలం: దేవీ నవరాత్రుల సమయంలో ఒక మహిళా అభ్యర్థి నామినేషన్ పత్రాలను చించుతారా: ఆత్మకూరు వైసిపి చైర్మన్ అభ్యర్థి ప్రియాంక భాయ్
యువత రాజకీయాల్లోకి రాకూడదా అని ఆత్మకూరు మున్సిపల్ ఛైర్మన్ YCP అభ్యర్థి డాక్టర్ ప్రియాంక బాయి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుల ధ్రువీకరణ పత్రం చించేసిన ఘటనపై సోమవారం కలెక్టర్ రాజకుమారిని కలిసి ఫిర్యాదు చేశారు. డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు సమర్పించామని, అయినా వాటిని చించివేయడం దారుణమని అన్నారు. దేవీ నవరాత్రుల సమయంలో ఒక మహిళ అభ్యర్థిని ఇంత అనగదొక్కాలని చూస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.