కర్నూలు: గణేకల్లులో టీడీపీలోకి 100 కుటుంబాలు: వైసీపీకి భారీ షాక్
ఆదోని మండలం గణేకల్లు గ్రామంలో మాజీ సర్పంచ్ సిద్ధ రమేష్ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. టీడీపీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నాయుడు, సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకుని పార్టీలోకి చేరారు. కూటమి ప్రభుత్వ పాలనపై నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.