పాయకరావుపేట: పాయకరావుపేటలో విషాదం: కాలువలో ఈతకు దిగి 19 ఏళ్ల యువకుడు మృతి
పాయకరావుపేట పోలవరం ఎడమ కాలువలో ఈతకు దిగి అత్తిలి నిఖిల్ వీర సత్య సాయి ప్రకాశ్ (19) మృతి చెందాడు. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు మునిగిపోయిన అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.