శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలోని ఓ ఇంట్లో పట్టుబడ్డ డబ్బులు ఓ పార్టీకి చెందిన ఎన్నికల డబ్బు: DSP రామాంజినాయక్
ఆత్మకూరు పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి బీమిశెట్టి కృష్ణమూర్తి ఇంట్లో సోదాల పై ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని పెద్దబజారు వీధిలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణమూర్తి ఇంట్లో సోదాలు నిర్వహించి 42 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో, స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనల మేరకు ఓ పార్టీకి చెందిన నగదు ఆ ఇంట్లో ఉందనే పక్కా సమాచారంతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, మునిసిపల్ సిబ్బందితో కలిసి ఈ తనిఖీలు చేపట్టామని డీఎస్పీ స్పష్టం చేశారు.