కాకినాడ సిటీ: స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఖర్చుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిఘా
స్థానిక సంస్థల ఎన్నికల్లో ధన, బల ప్రభావాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యయ పరిమితులను విధించింది. కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు గరుడ్ సంకేత్ సునీల్ మాట్లాడుతూ, వ్యయాల నమోదు మరియు నిబంధనల అమలుపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.