వరంగల్: వరంగల్ లో భవన నిర్మాణాలపై జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
వరంగల్ నగరంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియపై జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న దృష్టి సారించారు. గోపాలూర్, ప్రశాంత్ నగర్, భవానీనగర్ ప్రాంతాల్లోని భవనాలను పరిశీలించిన ఆయన, నిబంధనలకు విరుద్ధంగా అదనపు నిర్మాణాలు ఉంటే సర్టిఫికెట్లు రావని హెచ్చరించారు. ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు ఉండాలని అధికారులను ఆదేశించారు.