యాదగిరిగుట్ట: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కొండపై భక్తుల ఇబ్బందులు: మౌలిక సదుపాయాల కల్పనపై బీజేపీ డిమాండ్
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సౌకర్యాల విషయంలో బీజేపీ రాష్ట్ర ఎండోమెంట్ సెల్ కన్వీనర్ సూర్య ప్రకాష్ అసహనం వ్యక్తం చేశారు. కొండపై టాయిలెట్లు, సైన్ బోర్డులు, పార్కింగ్ వంటి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.