ఘన్పూర్ స్టేషన్: గండి రామారం లిఫ్ట్-1 ప్రాజెక్టు: జనవరిలోగా రైతులకు సాగునీరు - ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని గండి రామారం లిఫ్ట్-1 ప్రాజెక్టు పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. 70 శాతం పూర్తయిన పనులను నవంబర్ నాటికి పూర్తి చేసి, జనవరిలో రెండో పంటకు నీరందిస్తామని ఆయన తెలిపారు.