సిరిసిల్ల పట్టణంలో కలెక్టర్ బదిలీ అవ్వడాన్ని హర్షిస్తూ పట్టణ ప్రజలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి,టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గత కొద్ది రోజుల నుండి జిల్లా ప్రజలు, అధికారులు, నాయకులు కలెక్టర్ అవలంబిస్తున్న తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.జిల్లా కలెక్టర్ బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పట్టణ ప్రజలు విద్యానగర్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు.