గిద్దలూరు: బేస్తవారిపేటలో చిన్న మామను హత్య చేసి ఆపై మామని హత్య చేసేందుకు ప్రయత్నించిన నియతుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బేస్తవారిపేట గాంధీనగర్ లో ఈనెల 22వ తేదీన చిన్న మామను హత్య చేయడంతో పాటు పిల్లనిచ్చిన మామను హత్య చేసేందుకు ప్రయత్నించిన నిందితుడు పొద్దుటూరి పీరవలిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. రెండు నెలల క్రితం కొమరోలు మండలం పొట్టి రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పొద్దుటూరి పీరావలికి రాజా హుస్సేన్ తన కూతుర్ని ఇచ్చి వివాహం చేశాడు. కూతుర్ని ఇబ్బంది పెడుతున్నాడని మామ హుస్సేన్ రాజా తన తమ్ముడి ఖాజావలితో నిందితుడిని మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న పీరావలి యూట్యూబ్ లో వీడియోలు చూసి మరి చిన్నమామని హత్య చేశాడు. తర్వాత పిల్లనిచ్చిన మామను హత్య చేసేందుకు ప్రయత్నించాడు.