ఒంగోలు అర్బన్: జర్నలిస్టులపై న్యూఢిల్లీలో జరిగిన దాడుల ఘటనను ఖండిస్తూ ఒంగోలులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన జర్నలిస్టులు
Ongole Urban, Prakasam | Oct 14, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల సంఘం నిరసన కార్యక్రమం చేపట్టింది. న్యూఢిల్లీలో జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడానికి తీవ్రంగా ఖండించారు. నిరసన కార్యక్రమాలను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు కోరారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల భద్రత కొరకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.