ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను శనివారం ఆళ్లగడ్డ పట్టణములో ఘనంగా నిర్వహించారు, మెగా యూత్ ఫోర్స్ తాలూకా కన్వీనర్ పశుల నరేంద్ర, జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఆధ్వర్యంలో స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మెగా స్టార్ చిరంజీవి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు, చింతకుంట రోడ్డు లోని బాల సదనంలో అనాధ పిల్లల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు