రాయదుర్గం: డి.హిరేహాల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు దుర్మరణం
డి.హిరేహాల్ మండల పరిధిలోని కనుకుప్ప గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం మొలకల్మూరు తాలూక పుక్కర్తి గ్రామానికి చెందిన సునీల్ కుమార్, రుషివేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు బైక్ పై బళ్లారి వైపు నుంచి రాంపురం వైపు వెళుతుండగా బైక్ అదుపుతప్పి కల్వర్టు ను డీకొనింది. ఈ ప్రమాదంలో సునీల్ కుమార్ అక్కడిక్కడే మరణించగా రుషివేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని బళ్ళారి విమ్స్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు.