గన్నవరం: పి.గన్నవరంలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు
పి.గన్నవరం నియోజకవర్గంలో మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొని, అభిమానుల సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే గారు అభినందించారు.